రాయికల్
సైన్సు ప్రదర్శనలో మెరిసిన కృష్ణవేణి కుసుమం

viswatelangana.com
December 8th, 2024
రాయికల్ (విశ్వతెలంగాణ) :
జగిత్యాల లోని ఓల్డ్ హైస్కూల్లో జరిగిన జిల్లా స్థాయి సైన్స్ ప్రదర్శనలో రాయికల్ పట్టణానికి చెందిన కృష్ణవేణి పాఠశాల విద్యార్థిని ఆర్గానిక్ ఫార్మింగ్ విభాగంలో మొదటి బహుమతి పొంది రాష్ట్ర స్థాయికి ఎంపికైనందున ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, జిల్లా విద్యాధికారి రాము మెమెంటో మరియు ప్రశంసా పత్రం అందించి ప్రశంసించారు. మరియు ఇందులో పాల్గొన్న బి. మని చరణ్, 9వ తరగతి, ఎం.సాహిత్య 6వ తరగతి విద్యార్థులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ విజయం సాధించిన విద్యార్థిని పాఠశాల డైరెక్టర్ జె. తిరుపతి రావు, ప్రిన్సిపాల్ జే వేణుగోపాల్ రావు, మరియు ఉపాధ్యాయ బృందం అభినందించారు.



