viswatelangana.com
Date of Publish : 28 February 2025, 3:50 pm Digital Edition : VISWA TELANGANA DAILY NEWS
సౌదీలో పోసానిపేట వ్యక్తి దారుణ హత్య

అద్దె రూములో జరిగిన ఇద్దరి స్నేహితుల మధ్య గొడవ ఒక వ్యక్తి ప్రాణాన్ని బలిగొంది. గల్ఫ్ కార్మికుల సమాచారం మేరకు జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం పోసానిపేట గ్రామానికి చెందిన గుంట హనుమంతు అనే వ్యక్తి బతుకుదెరువు కోసం సౌదీలోని జుబెల్ లో పని చేసుకుంటూ కుటుంబానికి ఆసరాగా ఉంటున్నాడు. అయితే శుక్రవారం రోజు ఏం జరిగిందో తెలియదు కానీ ఇద్దరు రూమ్మేట్స్ మధ్య తలెత్తిన వివాదం హనుమంతు ప్రాణాన్ని బలిగొంది. హత్య చేసిన నిందితుడు పరారీలో ఉన్నట్లు సమాచారం. ఘటనకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. హనుమంతు మృతితో పోసానిపేట గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి..

Change News Type