స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలి

viswatelangana.com
జగిత్యాల జిల్లా కేంద్రంలో బిసి సంక్షేమ సంఘం ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరైన బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి ముసిపట్ల లక్ష్మీనారాయణ మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో బిసిలకు 42 శాతం రిజర్వేషన్ లు కల్పిస్తూ జీవో జారీ చేసినాకే రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. బీసీ రిజర్వేషన్ ల అంశాన్ని కేంద్రంపై నెట్టేసి, దాటవేసే ప్రయత్నంలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని పేర్కొన్నారు. బీసీ రిజర్వేషన్ జీవోను రాష్ట్ర ప్రభుత్వం జారీ చేయని యెడల వెయ్యి మంది బిసి నేతలతో కలిసి బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆమరణ నిరాహారదీక్ష చేయడానికి సిద్ధమని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. తెలంగాణ సీఎం న్యాయ నిపుణులు, బిసి సంఘాలతో సమావేశాన్ని ఏర్పాటు చేసి రిజర్వేషన్ల అమలు ప్రక్రియపై ముందుకెళ్లాలని కోరారు. పార్టీల పరంగా 42శాతం రిజర్వేషన్లు ఇస్తామని ప్రకటిస్తున్నారని, అలా కాకుండా చట్టపరంగా బిసిలకు వాటా ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించని క్రమంలోఈ అంశం పైన చలో ఢిల్లీ కార్యక్రమం నిర్వహించి, ఈ అంశాన్ని రాహుల్ గాంధీ దృష్టికి తీసుకెళ్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి ముసిపట్ల లక్ష్మీనారాయణ, జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి ఎలుక భగవాన్ యాదవ్, బి.సి యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు కొక్కు గంగాధర్, బి.సి యువజన సంఘం జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ తిరుపురం రాంచందర్, బి.సి మహిళా సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి రాచకొండ రోజా (న్యాయవాది), బిసి సంక్షేమ సంఘం పట్టణ అధ్యక్షుడు రాపర్తి రవి, బిసి సంక్షేమ సంఘం సాంస్కృతిక కార్యదర్శి బొమ్మిడి నరేష్ కుమార్, బిసి యువజన సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు అనుమల్ల సంజయ్ సామ్రాట్, బిసి విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు దండుగుల వంశీ, బిసి సంక్షేమ సంఘం నియోజకవర్గ అధ్యక్షురాలు బండపెల్లి మల్లీశ్వరి, యూత్ కో-ఆర్డినేటర్ హృషికేష్, బండపెల్లి నర్సయ్య, బిసి నాయకులు తదితరులు పాల్గొన్నారు.



