viswatelangana.com
Date of Publish : 25 September 2024, 6:10 pm Digital Edition : VISWA TELANGANA DAILY NEWS
స్వచ్ఛతా కీ భాగీదారీ లో డ్రాయింగ్ కాంపిటీషన్

మునిసిపల్ కమీషనర్ బట్టు తిరుపతి ఆదేశాల మేరకు స్వచ్చత హి సేవకార్యక్రమంలో భాగంగా కల్లూరు రోడ్డు లో గల జెడ్పిహెచ్ఎస్ బాలికల పాఠశాలలో ప్లాస్టిక్ వల్ల కలిగే అనర్ధాలను మరియు తడి, పొడి చెత్త వేరు చేసే విధానాన్ని వివరించి డ్రాయింగ్ కాంపిటీషన్ నిర్వహించారు. ఇందులో 2వందల 82 విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థులు వేసిన డ్రాయింగ్స్ స్వచ్ఛతకు అద్దం పట్టేలా ఉన్నాయి. ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం ద్వారా కోరుట్లను స్వచ్ఛ పట్టణంగా తీర్చిదిద్దుకోవచ్చు అని పిల్లలు చెప్పారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ బట్టు తిరుపతి, ఇంచార్జ్ సానిటరీ ఇన్స్పెక్టర్ అశోక్, ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ గొనేల మహేష్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు మరియు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

Change News Type