viswatelangana.com
Date of Publish : 20 September 2024, 4:45 pm Digital Edition : VISWA TELANGANA DAILY NEWS
స్వచ్ఛత హి సేవ 2024 లో పాల్గొని కోరుట్లను స్వచ్ఛ పట్టణంగా తీర్చిదిద్దుదాం

స్వచ్ఛభారత్ మిషన్ అర్బన్ 2.0 లో భాగంగా స్వచ్ఛత హి సేవ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమం 2024 సెప్టెంబర్ 17 నుండి 2024 అక్టోబర్ 02 వరకు నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా కోరుట్ల మున్సిపల్ కమిషనర్ బట్టు తిరుపతి ఆదేశాల మేరకు కల్లూరు రోడ్ లోని ప్రాథమిక పాఠశాల యస్.ఆర్.యస్.పి క్యాంప్ గడి స్కూల్ విద్యార్థిని విద్యార్థులు అలాగే ఉపాధ్యాయులతో స్వచ్ఛ ప్రతిజ్ఞ చేయించి, పాఠశాల విద్యార్థులు స్వచ్ఛందంగా పాఠశాల పరిసరాలను శుభ్రం చేసారు. అలాగే గడి స్కూల్ విద్యార్థులకు స్వచ్ఛతపై మరియు ఇంటి నుంచి వచ్చే చెత్త సేకరణ గురించి అవగాహన కల్పించి, వ్యాసరచన పోటీ నిర్వహించారు.ఈ స్వచ్ఛత హి సేవ కార్యక్రమములో భాగం గా సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 1వ వరకు పట్టణంలోని ప్రజలకు మరియు విద్యార్థిని విద్యార్థులకు ఈ కార్యక్రమంపై అవగాహన కల్పిస్తూ పట్టణమును పరిశుభ్రంగా ఉంచడం కోసం కృషి మరియు అక్టోబర్ 2 న స్వచ్ఛతపై కార్యక్రమం నిర్వహిణ, ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు నునావత్ రాజు, ఇంచార్జ్ సానిటరీ ఇన్స్పెక్టర్ అశోక్, ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ గోనెల మహేష్, హేమంత్, గౌతమ్, పాఠశాల ఉపాధ్యాయులు సురేందర్, ఫాతిమా, ధన లక్ష్మి, మున్సిపల్ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

Change News Type