కోరుట్ల
స్వచ్ఛదనం- పచ్చదనం కార్యక్రమములోఫ్రైడే – డ్రైడే

viswatelangana.com
August 9th, 2024
కోరుట్ల (విశ్వతెలంగాణ) :
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛదనం- పచ్చదనం కార్యక్రమములో భాగంగా శుక్రవారం రోజున పట్టణములో అన్ని వార్డులలో ఎస్. హెచ్.జి సభ్యులు అలాగే వార్డ్ ఆఫీసర్లు, ఫ్రైడే – డ్రైడే కార్యక్రమం నిర్వహించి, నీరు నిలువకుండా చర్యలు తీసుకోవడం జరిగింది. అన్ని ప్రభుత్వ సంస్థలలో పరిసరాలను శుభ్రం చేయడం జరిగింది. శిధిలావస్థలో ఉన్న భవనాలను గుర్తించి నోటీసులు ఇవ్వడం జరిగింది. వనమహోత్సవంలో భాగంగా డివైడర్ మధ్యలో అలాగే ఐలాపూర్ రోడ్డులో మొక్కలు నాటడం జరిగింది. ఈ కార్యక్రమములో మున్సిపల్ కమిషనర్ బట్టు తిరుపతి, వార్డు కౌన్సిలర్లు, టిపిఓ ప్రవీణ్, ఏ.ఈ లు అరుణ్ కుమార్, తిరుపతి, లక్ష్మి అలాగే టి పి ఎస్ రమ్య , వార్డ్ ఆఫీసర్లు, మున్సిపల్ సిబ్బంది, ఆర్ పి లు, మహిళా సంఘ సభ్యులు, ప్రజాప్రతినిధులు, వార్డు ప్రజలు పాల్గొన్నారు.



