కోరుట్ల

స్వచ్ఛభారత్ దివస్ కి గాను కోరుట్ల

viswatelangana.com

October 2nd, 2024
కోరుట్ల (విశ్వతెలంగాణ) :

స్వచ్ఛభారత్ దివస్ ని పురస్కరించుకొని స్వచ్ఛత హి సేవ కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛ భారత్ మిషన్ ప్రారంభమై 10 సంవత్సరాలు గడిచిన సందర్భంగా జరుగుతున్న పురస్కారాలకు తెలంగాణ నుంచి 4 మున్సిపాలిటీలు ఎంపికయ్యారు దీనిలో ఒకటి కోరుట్ల పట్టణం కావడం గర్వకారణం. దీనిని పురస్కరించుకొని ఢిల్లీలో జరిగే కార్యక్రమానికి డీఎంఏ గౌతమ్ కలిసి చైర్పర్సన్ అన్నం లావణ్య అనిల్ మున్సిపల్ కమిషనర్ బట్టు తిరుపతి హాజరవుతూ దీని ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాట్లాడుతూ స్వచ్ఛభారత్ మిషన్ కి ఇక ముందు కూడా అన్ని పట్టణాలు సమర్థవంతంగా నిర్వహించడానికి సిద్ధంగా ఉండాలని, స్వచ్ఛ భారత్ మిషన్ అనేది ఇలాగే ఇకముందు కూడా కొనసాగుతుందని, ఇది అందించే పురస్కారాలను పట్టణాలు అందుకోవాలని ఆయన తెలిపారు. దీనిని ఉద్దేశించి చైర్ పర్సన్ మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ వీటికి హాజరు కావడం తమకు గర్వంగా ఉందని, వారు తెలిపారు. పట్టణ ప్రజలు, ప్రజా ప్రతినిధులు, పాత్రికేయులు,పరిశుద్ధ కార్మికులు అందరి కృషి వాళ్ళని మన పట్టణం ఈ స్థానంలో ఉందని వారందరి ధన్యవాదాలు తెలిపారు.

Related Articles

Back to top button