కోరుట్ల
స్వభావ్ స్వచ్ఛత, సంస్కార్ స్వచ్ఛత

viswatelangana.com
September 21st, 2024
కోరుట్ల (విశ్వతెలంగాణ) :
స్వచ్ఛతా హి సేవా 2024 లో భాగంగా, సెప్టెంబర్ 17 నుండి 2024 అక్టోబర్ 2 వరకు “స్వభావ్ స్వచ్ఛత, సంస్కార్ స్వచ్ఛత ” సంపూర్ణ స్వచ్ఛత (స్వచ్ఛత లక్షిత్ ఏకైతో సహా) “స్వచ్ఛతా కీ భాగీదారీ” ప్రజల భాగస్వామ్యం, అవగాహన అలాగే న్యాయవాదం, మున్సిపల్ కమీషనర్ బట్టు తిరుపతి ఆదేశాల మేరకు స్వచ్చత హి సేవ కార్యక్రమంలో భాగంగా జెడ్పిహెచ్ఎస్ బాయ్స్ స్కూల్ విద్యార్థులకు తడి, పొడి, హానికర చెత్త వేరు చేయడం ద్వారా కలిగే ప్రయోజనాలు అలాగే ప్లాస్టిక్ వాడకం ద్వారా కలిగే అనర్ధాల గురించి అవగాహన కలిగించడంతో పాటు స్వచ్ఛత ప్లెడ్జ్ నిర్వహించారు. అంతేగాక విద్యార్థులతో మానవహారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో, ఇంచార్జ్ శానిటరీ ఇన్స్పెక్టర్ బాలే అశోక్, ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ గోనెల మహేష్ , ప్రధాన ఉపాధ్యాయులు శ్రీనివాస్ అలాగే ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.



