కోరుట్ల పట్టణం లోని యువత స్వచ్చందంగా ముందుకు వచ్చి రైల్వే స్టేషన్ అలాగే పరిసర ప్రాంతాలను శుభ్రపరిచారు. ఈ కార్యక్రమంలో దాదాపు 35 మంది యువకులు భాగస్వామ్యం అయ్యారు. ఈ కార్యక్రమంను ఉద్దేశించి మున్సిపల్ కమిషనర్ బట్టు తిరుపతి మాట్లాడుతూ పట్టణంలోని యువకులు అలాగే స్వచ్ఛంద సేవ సంఘాలు స్వచ్చత హి సేవ కార్యక్రమంలో పాల్గొని దీనిని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జ్ సానిటరీ ఇన్స్పెక్టర్ అశోక్, ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ గొనేల మహేష్, కోరుట్ల పట్టణ యువకులు అలాగే మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.