స్వర్గీయ ఎన్టీఆర్ కు వెంటనే భారతరత్న ప్రకటించాలి
కోరుట్ల నియోజకవర్గ టీడీపీ ఇంచార్జి మానుక ప్రవీణ్ కుమార్

viswatelangana.com
కోరుట్ల నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్ మానుక ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో శనివారం పట్టణంలోని పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ 43,వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్ మానుక ప్రవీణ్ కుమార్ తెలుగుదేశం జెండా ఆవిష్కరించి, కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కీర్తిశేషులు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావుకు భారతరత్న బిరుదును వెంటనే ప్రకటించాలని కోరారు. తెలుగుదేశం పార్టీ స్థాపించి కేవలం 09 నెలల్లోనే అధికారాన్ని చేపట్టిన ఘనత మన ఎన్టీఆర్ కే దక్కుతుందని అన్నారు. అన్ని వర్గాల ప్రజల కోసం ఎన్నో ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి చరిత్ర సృష్టించిన ఘనత ఎన్టీఆర్ దని, అలాగే రెండు రూపాయల కిలో బియ్యం, జనతా వస్త్రాలు, పటేల్ పట్వారి వ్యవస్థ రద్దు,మహిళలకు ఆస్తిలో సమాన హక్కు, పక్కా గృహ నిర్మాణ పథకము, మహిళా రిజర్వేషన్, బడుగు బలహీన వర్గాల రిజర్వేషన్, అన్ని మండలిక వ్యవస్థ రద్దు, మన రాష్ట్రంలోనే ప్రతి పల్లెలకు బస్సు సౌకర్యం కల్పించిన ఘనత మన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ హయాంలో జరిగిందని తెలిపారు. తెలుగు ప్రజలకు రాజకీయ అవగాహన కల్పించిన ఘనత కూడా ఎన్టీఆర్ దేనని, అలాగే ఇలాంటి ఎన్నో పథకాలు చిరస్థాయిగా నిలబెట్టిన ఘనత మన తెలుగుదేశం భారతరత్నపార్టీదే నని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు పాతర్ల విజయకుమార్, గజమానంద్, గజెల్లి రాజ గణేష్, మచ్చ లక్ష్మీపతి, రాజ నరేందర్, చలిగంటి నర్సింగం, నరసయ్య, ఎండి రఫీ, విజయ్, తెలుగు మహిళ నాయకురాలు మల్లీశ్వరి, శాంత, కళ్యాణి, శైలజ, పద్మ, రాణి, విజయలక్ష్మి, జ్యోతి, దివ్య, సోనీ, శిరీష, పార్టీ అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు.



