హత్యకు గురైన అవుదుర్తి మమత

viswatelangana.com
జగిత్యాల జిల్లా కొడిమ్యాల పట్టణంలో అందిన సమాచారం మేరకు కొడిమ్యాల గ్రామానికి చెందినఆవుదుర్తి మమత w/oమహేందర్ 35 సంవత్సరాలు, కులం మంగలి, హత్యకు గురయ్యారు,వివరాల్లోకి వెల్లగా ఆమె కు 20 సంవత్సరాల క్రితం ఆవుదుర్తి మహేందర్ s/o లక్ష్మణ్ r/o కొడిమ్యాల తో వివాహం జరుగింది , గత సంవత్సరం నుండి ఆమెను తన భర్త అయిన ఆవుదుర్తి మహేందర్ అత్తమామలు ఆవుదుర్తి వజ్రవ్వ, లక్ష్మణ్ మరదులు అయిన ఆవుదుర్తి అనిల్, ఆవుదుర్తి వెంకటేష్ లు ఆస్తి తగాదాల విషయంలో,మమతను కట్న కానుకలు తీసుకు రాలేదని మరియు, సంతానం లేదని మానసికంగా వేధించడమే కాకుండా తన వల్లనే ఆస్తి తగాదాలు జరుగుతున్నాయని నిందించేవారు . అయితే ఇట్టి తగాదాల విషయంలో తన భార్యను చంపాలని నిర్ణయించుకుని కోడిమ్యాలలోని వారి ఇంటికి తీసుకొని వచ్చి తేదీ 26.04.24 రోజున హత్య చేసినాడు, కానీ మమత యొక్క తల్లిదండ్రులకు తన భార్య కనబడటం లేదని తేది 26/04/2025 నాడు తెలుపగా, వారు వెతికి తేదీ 28 /04/2025 రోజున కరీంనగర్ వన్ టౌన్ పిఎస్ లో దరఖాస్తు ఇచ్చి, మహేందర్ ను అతని తల్లిదండ్రులను మమత యొక్క జాడ గురించి నిలదీయగా వారు మాట దాటవేస్తుండడంతో అనుమానంతోని తేదీ 02/05/2025 రోజున తాళం వేసిన కొడిమ్యాలలోని వారి ఇంటిని తనిఖీ చేసి చూడగా అందులో మా అల్లుడు మహేందర్ తన కూతురు మమతను హత్య చేసి ఉండడం చూశాననీ మమత యొక్క తల్లి రాచకొండ పద్మ w/o సత్తయ్య r/o మల్లాపూర్ (v), గంగాధర (m) , ఫిర్యాదు ఇవ్వగా కొడిమ్యాల పోలీస్ స్టేషన్ నందు ఎస్సై సందీప్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినారు



