viswatelangana.com
Date of Publish : 11 March 2024, 1:08 pm Digital Edition : VISWA TELANGANA DAILY NEWS
హత్య కేసును చేదించిన పోలీసులు

జగిత్యాల జిల్లా రాయికల్ మండలం తాట్లవాయి లో జరిగిన నాగెల్లి సురేష్ హత్య కేసు వీడింది. మృతుడి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు గతంలో నాగేల్లి భూమేష్ అనే వ్యక్తి సురేష్ ని చంపుతానని బెదిరించాడని తెలుపగా, అదే సమయానికి భూమేష్ ఊరిలో లేకపోవడంతో అనుమానంతో పోలీసులు రెండు బృందలుగా గాలించారు. తేదీ 11-03-2024 సోమవారం ఉదయం 6 గంటలకు నిందితుడు ఇంటివద్ద ఉన్నాడని సమాచారాన్ని తెలుసుకొని పట్టుకున్నారు పోలీసులు. పోలీసుల ప్రాథమిక విచారణలో నిందితుడు నేరాన్ని ఒప్పుకున్నట్లు తెలిపారు. తన భార్యతో సన్నిహితం గా ఉంటున్నాడనే అనుమానంతో ఈ హత్య చేసినట్లు నిందితుడు తెలిపాడని పోలీసులు తెలిపారు. హత్య చేయడానికి వాడిన కత్తిని, మొబైల్ ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముద్దాయిని రిమైండుకు తరలిస్తున్నట్లు ప్రెస్ మీట్ లో తెలిపారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల డిఎస్ పి రఘు చందర్, జగిత్యాల రూరల్ సి ఐ అరిఫ్ అలీ ఖాన్, రాయికల్ ఎస్ ఐ అజయ్ మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Change News Type