కోరుట్ల

హత్య కేసు నిందితుల అరెస్ట్

viswatelangana.com

October 17th, 2024
కోరుట్ల (విశ్వతెలంగాణ) :

కోరుట్ల సర్కిల్ ఆఫీస్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మేట్ పల్లి డి.ఎస్.పి కే. ఉమా మహేశ్వర రావు హత్య కేసు నిందితుల అరెస్ట్ వివరాలు తెలుపుతూ ఆదివారం రోజున రాత్రి 11 గంటల సమయంలో స్థానిక ప్రకాశం రోడ్డులో పంబాల మధు, ఇప్పకాయల నరేష్ లతో మృతుడు సాగర్ ల మధ్య జరిగిన గొడవల నేపథ్యంలో ఆ విషయంగా గుద్దేటి వెంకటేష్ వారి మధ్య రాజీ కుదుర్చుకోవడానికి ప్రయత్నాలు చేసిన కూడా మృతుడు సాగర్ అందుకు రాజీ పడకపోగా ఎప్పటికైనా మధు, నరేష్ లను చంపుతానని సాగర్ బెదిరించాడని, వెంకటేష్ తో చెప్పగా ఈ క్రమంలో సోమవారం రోజున రాత్రి సుమారు 10 గంటల సమయంలో తన అనుచరులతో కలిసి ప్రకాశం రోడ్ లోని పంబాల నాగరాజు ఇంటికి వెళ్లి అతనితో గొడవ పడి నానా హంగామా సృష్టించగా ఆ సమాచారం అందుకున్న గుద్దేటి వెంకటేష్, గుద్దేటి విజయ్, రాకేష్ లు నాగరాజు ఇంటికి వెళ్లి అక్కడ నాగరాజు తో గొడవ పడుతున్న మృతుడు సాగర్ ను వారి ఇంటి నుండి బయటకు ఇడ్చుకొని వచ్చి కూడలి వద్ద సాగర్ ను గుద్దేటి వెంకటేష్ తన వద్ద ఉన్న కత్తితో గొంతు కోసి చంపడని, అనంతరం నిందితులు సంఘటన స్థలం నుండి పారిపోగా జగిత్యాల ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశానుసారం మెట్ పల్లి డి.ఎస్.పి కే. ఉమామహేశ్వరరావు పర్యవేక్షణలో కోరుట్ల సీఐ బి.సురేష్ బాబు, ఎస్సై ఎస్ శ్రీకాంత్, సిబ్బంది ఎల్లయ్య, పురుషోత్తం, విజయ్, సత్తయ్య లు నిందితులను పట్టుకోవడానికి గాలింపు చర్యలు చేపట్టగా గురువారం ఉదయం కోరుట్ల శివారులోని గుద్దేటి వెంకటేష్ యొక్క నాగులమ్మ బిక్స్ ఫ్యాక్టరీలో నిందితులు ఉన్నారని పక్క సమాచారంతో కోరుట్ల సీఐ బి. సురేష్ బాబు, ఎస్ఐ ఎస్ శ్రీకాంత్, వారి సిబ్బందితో అక్కడికి వెళ్లి ఐదుగురు నిందితులను పట్టుకున్నారని, వారి వద్ద నుండి మృతుడిని చంపడానికి ఉపయోగించిన ఒక కత్తి, రెండు బైకులు అలాగే నాలుగు సెల్ ఫోన్ లను పోలీసులు వారి వద్ద నుండి స్వాధీనపరుచుకున్నారు. ప్రధాన నిందితుడిగా ఉన్న పంబాల నాగరాజు పరారిలో ఉన్నాడని అతడిని త్వరలో పట్టుకుంటామని తెలిపారు. అదేవిధంగా ఈ కేసు విచారణలో ఇంకెవరైనా నిందితుల ప్రమేయం ఉంటె వారిపై కూడా చట్టపరంగా తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు. నిందితులను పట్టుకోవడంలో కృషి చేసిన కోరుట్ల సిఐ బి.సురేష్ బాబు, కోరుట్ల ఎస్ఐ. ఎస్. శ్రీకాంత్ అలాగే వారి సిబ్బందిని జగిత్యాల ఎస్పీ అశోక్ కుమార్, మెట్ పల్లి డి.ఎస్.పి కే. ఉమామహేశ్వరరావు అభినందించారు.

Related Articles

Back to top button