కోరుట్ల
హనుమాన్ స్వాములకు అల్పాహారం అందించి మత సామారస్యం చాటిన ముస్లిం యువకులు

viswatelangana.com
April 19th, 2024
కోరుట్ల (విశ్వతెలంగాణ) :
జగిత్యాల రూరల్ మండలం లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన ముస్లిం యువకులు హనుమాన్ స్వాములకు శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం వద్ద అల్పాహారం అందించి హిందూ – ముస్లిం భాయ్ భాయ్ అని మత సమరస్యాన్ని చాటి చెప్పారు. ముస్లిం యువకులు హనుమాన్ దీక్ష పరులకు అల్పాహారం అందించడం పట్ల హార్షం వ్యక్తం చేస్తూ ముస్లిం యువకులను గ్రామ ప్రజలు అభినందించారు.



