కోరుట్ల
హర్షవర్ధన్ అంతిమయాత్రలో పాల్గొన్న జువ్వాడి కృష్ణారావు

viswatelangana.com
July 25th, 2024
కోరుట్ల (విశ్వతెలంగాణ) :
కోరుట్ల మండలం సంగెం గ్రామానికి చెందిన పోతుకూరి రవి, కుమారుడు హర్షవర్ధన్ రెడ్డి బుధవారం హైదరాబాదులో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా మృతుడి స్వగ్రామం సంగెంలో అంత్యక్రియలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జువ్వాడి కృష్ణారావు పాల్గొని కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ కార్యక్రమంలో జువ్వాడి కృష్ణారావు వెంట కోరుట్ల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొంతం రాజాం, శంకర్ గౌడ్ రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు.



