కోరుట్ల

హిందూ వాహిని లో చెరికలు

viswatelangana.com

July 27th, 2024
కోరుట్ల (విశ్వతెలంగాణ) :

శుక్రవారం రోజు 26/07/2024 దేశం కోసం దేశ ప్రజల కోసం ప్రాణాలు అర్పించిన కార్గిల్ అమర వీరులకు నివాళులు అర్పించిన జగిత్యాల జిల్లా లోని పలు మండలాల యువకులు తెలంగాణ రాష్ట సంఘటన్ ముడుపు యాది రెడ్డి ఆధ్వర్యంలో హిందూ వాహిని లో చేరడం జరిగింది జగిత్యాల జిల్లా సంయోజక్ కొండబత్తిని అమర్ నాథ్, సహా సంయోజక్ వడ్లకొండ శ్రీనివాస్ , మతులపురం శివాజీ, సంపర్క్ ప్రముఖ్ గా కోడిపెల్లి విష్ణు, మహిళా ప్రముఖ్ గా బూస గౌతమి, యువ ప్రముఖ్ గా కునారపు గణేశ్, న్యాయ ప్రముఖ్ గా సూర్య ప్రసాద్, సమాచార ప్రముఖ్ గా అల్లె రాము, ఆర్థిక ప్రముఖ్ గా కైలాష్, కార్యాలయ ప్రముఖ్ గా బూస కిషోర్, బోధన ప్రముఖ్ గా మిట్టపల్లి హరీష్, భూ ఆక్రమణ ప్రముఖ్ గా చిట్యాల రాకేష్, సున్నిత ప్రాంతాల ప్రముఖ్ గా అరుణ్ సాయి, చట్ట విరుద్ధ ప్రముఖ్ గా సూర మహేష్, స్వావలంబన ప్రముఖ్ గా గోనే వినయ్ మరియు రాజు భాద్యతలు స్వీకరించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో హిందూ వాహిని తెలంగాణా ప్రాంత సంఘటన్ ముడుపు యాది రెడ్డి మాట్లాడుతూ ప్రపంచ దేశాల్లో మన దేశం అభివృధి లో, మన హైందవ సంస్కృతి లో మనల్ని చూసి ఎన్నో దేశాలు నేర్చుకుంటూన్నాయి. అలాంటి తరుణంలో లో కొంత మంది రాజకీయ నాయకులు ఓటు బ్యాంకు రాజకీయాలు చేసి హిందువులని చిన్న చూపు చూస్తున్నారు. హిందువులు సంగటితం కావాల్సిన అవసరం సమయం వచ్చింది హిందూ మతము దూషించిన మన సంస్కృతిని అవమాన పరిచిన వాళ్ళని తరిమి కొట్టాలి. దేశ కోసం ప్రాణాలు అర్పించిన మహనీయుల ని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్క హిందూ వాహిని కార్యకర్త దేశం కోసం మన హైందవ ధర్మం పట్ల కట్టుబడి ఉండాలని కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. తొందర్లోనే జిల్లా వ్యాప్తంగ అన్ని గ్రామాల్లో మండల , పట్టణ కేంద్రం లలో పూర్తి స్థాయి కమిటీలను వేస్తాం అని ప్రకటించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో హిందూ వాహిని విభాగ్ కన్వీనర్ వేముల సంతోష్ మరియు తెలంగాణ ప్రాంత అధ్యయన ప్రముఖ్ గట్ల ప్రకాష్ మరియు హిందూ వాహిని కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.

Related Articles

Back to top button