కోరుట్ల
ఉత్సహంగా 10 వ తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

viswatelangana.com
October 7th, 2024
కోరుట్ల (విశ్వతెలంగాణ) :
కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 2005-2006 10వ తరగతి పూర్తి చేసిన పూర్వ విద్యార్థిని, విద్యార్థులు అందరు కలిసి 18 సంవత్సరాల తరువాత మల్లి ఒక్క వేదిక ఏర్పాటు చేసుకొని వారందరు అక్కడ కలుసుకున్నారు. ఇందులో ముఖ్య అతిధులుగా గురువులు అంజిరెడ్డి, లక్ష్మి నర్సయ్య, భూమాచారి, నాగేశ్వర్, చాంద్ ఖాన్, పాల్గొన్నారు. ఈ సందర్బంగా విద్యార్థులు పాఠశాలలో జరిగిన గత రోజులను గుర్తుకు చేసుకున్నారు.. అనంతరం ఆటపాఠాలతో కార్యక్రమాన్ని నిర్వహించుకున్నారు.



