viswatelangana.com
Date of Publish : 19 October 2024, 1:33 pm Digital Edition : VISWA TELANGANA DAILY NEWS
హైదరాబాద్ లో మంత్రులను కలిసిన జువ్వాడి కృష్ణారావు

కోరుట్ల నియోజకవర్గం మల్లాపూర్ మండల కేంద్రం నుండి రాష్ట్ర రాజధాని హైదరాబాద్ కు ఆర్టీసీ బస్సును వెంటనే ప్రారంభించాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ను రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జువ్వాడి కృష్ణారావు కోరారు. ఈ మేరకు రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లోని మినిస్టర్స్ క్వార్టర్స్ నివాసంలో మంత్రిని కలిసి విజ్ఞప్తి చేశారు. అనంతరం ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన మంత్రి శ్రీధర్ బాబును హైదరాబాదు లోని వారి నివాసంలో కలిశారు.

Change News Type