13వ వార్డు లో బిజెపి ప్రాథమిక సభ్యత్వం
ముఖ్య అతిథిగా బిజెపి రాష్ట్ర కార్యదర్శి పల్లె గంగారెడ్డి హాజరు

viswatelangana.com
కోరుట్ల పట్టణంలోని 13వ వార్డు బూతు నెంబర్ 143లో శక్తి కేంద్రం ఇంచార్జ్ అలాగే బూత్ అధ్యక్షురాలు సుధవేని మహేష్ కీర్తన ఆధ్వర్యంలో బిజెపి ప్రాథమిక సభ్యత్వ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బిజెపి రాష్ట్ర కార్యదర్శి పల్లె గంగారెడ్డి పాల్గొని ఆయన మాట్లాడుతూ… ఈ దేశం సురక్షితంగా ఉండాలంటే మన భావితరాల భవిష్యత్తు అలాగే బడుగు, బలహీన వర్గాల జీవితాలు బాగుపడాలంటే బీజేపీ సభ్యత్వం పొందాలని “వికసిత్ భారత్” నిర్మాణంలో భాగస్వాములు కావాలని కోరారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఆలోచన విధానంలో నడవాలని, అయితే వెంటనే భారతీయ జనతా పార్టీ ప్రాథమిక సభ్యత్వ నమోదు చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి పట్టణ అధ్యక్షులు బింగి వెంకటేష్, బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి రాచకొండ యాదగిరి బాబు, కోరుట్ల నియోజకవర్గ ఇంచార్జ్ చెట్లపెళ్లి సుఖేందర్ గౌడ్, జిల్లా అధికార ప్రతినిధి వడ్డేపల్లి శ్రీనివాస్, రాష్ట్ర ఓబీసీ మోర్చా ఉపాధ్యక్షులు రుద్ర శ్రీనివాస్, పట్టణ ప్రధాన కార్యదర్శి చెట్లపల్లి సాగర్, పట్టణ ఉపాధ్యక్షులు కంఠం ఉదయ్ అలాగే వార్డు మహిళలు, యువకులు పాల్గొన్నారు.



