కోరుట్ల

విద్యాసాగర్ రావు కెసిఆర్ గతంలో నిన్నెందుకు పార్టీ నుండి సస్పెండ్ చేశాడు

నిలదీసిన సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కృష్ణారావు

viswatelangana.com

September 27th, 2024
కోరుట్ల (విశ్వతెలంగాణ) :

విద్యాసాగర్ రావు గతంలో కేసీఆర్ నిన్ను టిఆర్ఎస్ పార్టీ నుంచి ఎందుకు బహిష్కరించాడో నియోజకవర్గ ప్రజలకు చెప్పాలని, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జువ్వాడి కృష్ణారావు డిమాండ్ చేసారు. శుక్రవారం నియోజకవర్గ కేంద్రమైన కోరుట్ల పట్టణంలోని కృష్ణారావు స్వగృహం జువ్వాడి భవన్లో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ గతంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో డబ్బులు తీసుకుని దొంగ ఓటు వేశాడని ఆరోపిస్తూ టిఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్, మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావును టీఆర్ఎస్ పార్టీ నుండి బహిష్కరించిన విషయం నిజం కదా ఇది నియోజకవర్గ ప్రజలందరికీ తెలిసిన విషయమిది అలాంటిది నువ్వు రేవంత్ రెడ్డి మీద ఆరోపణలలు తీవ్రంగా ఖండిస్తున్నాం, నాలుగు సార్లు నువ్వు ఎమ్మెల్యేగా గెలిచావు నీ కొడుకుని ఒకసారి గెలిపించారు. ఇన్ని రోజుల సమయంలో నువ్వు నియోజకవర్గంలో చేసిన ఒక్క అభివృద్ధి కార్యక్రమం చెప్పగలవా ఉన్న ఇంజనీరింగ్ కాలేజ్ ని తీసుకుపోయి హైదరాబాదులో పెట్టుకుని డబ్బులు సంపాదిస్తున్నావు. ప్రజలకు నువ్వు చేసిన మేలు ఉంటే ఒకసారి చెప్పు నువ్వు చేసిన అభివృద్ధి పని ఒక్కటైనా కోరుట్ల ప్రజలకు చెప్పగలవా మరొకసారి మీరు రాష్ట్ర ముఖ్యమంత్రిపై నిరాధార ఆరోపణలు చేస్తే కోరుట్ల నియోజకవర్గం ప్రజలు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చూస్తూ ఊరుకోరని తగిన బుద్ధి చెప్తారని జువ్వాడి కృష్ణారావు హెచ్చరించారు. ఈ విలేకరుల సమావేశంలో జువ్వాడి కృష్ణారావుతోపాటు ఇబ్రహీంపట్నం వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఎలాల వెంకటరెడ్డి, ఉమ్మడి కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ మాజీ ప్రధాన కార్యదర్శి సదానంద చారి, నేమూరి భూమయ్య, జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ మైనారిటీ విభాగం కార్యదర్శి మహమ్మద్ రఫీ, ఇబ్రహీంపట్నం మార్కెట్ కమిటీ డైరెక్టర్ బుస రాజేశ్వర్, మాజీ సర్పంచ్ పుల్ల కిష్ట గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Back to top button