18 ఏళ్ల తర్వాత – మళ్లీ అదే క్లాస్‌రూమ్ అనుభూతి!
గౌతమ్ హైస్కూల్ 2006-07 బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఘన సమ్మేళనం

viswatelangana.com
కోరుట్ల గౌతమ్ హైస్కూల్ 2006–07 తెలుగు మీడియం పదవ తరగతి పూర్వ విద్యార్థుల సమ్మేళనం శనివారం రారాజు ఫంక్షన్ హాల్‌లో జ్యోతిర్మయంగా జరిగింది. ప్రారంభంగా విద్యార్థులు తమ గురువులను సన్మానించి, గౌరవాన్ని చాటుకున్నారు. వివిధ రంగాల్లో స్థిరపడ్డ పాత స్నేహితులు, 18 ఏళ్ల అనంతరం ఒక్కచోట చేరి బాల్యాన్ని గుర్తు చేసుకున్నారు. ఆటలు, పాటలు, చిన్నపాటి అల్లరి సంఘటనలు, ఆనంద కలయికతో వేడుక ఉత్సాహభరితంగా సాగింది. జీవిత ప్రయాణాల్లో స్నేహితుల ప్రాధాన్యతను ప్రతిఒక్కరూ గుర్తు చేసుకున్నారు. గురువుల మందలింపులు, పాఠశాల మోజు, చిన్నప్పటి అనుభూతులు మళ్లీ కనబడినట్టు వేదిక మారింది. ఆనందంతో పాటు కొందరు భావోద్వేగానికి లోనయ్యారు. విజయలక్ష్మి అనే పూర్వ విద్యార్థిని మృతిచెందిన విషయం తెలపడం అందరినీ కలచివేసింది. ఒకరినొకరు ఆలింగనం చేసుకుంటూ యోగక్షేమాలు తెలుసుకున్నారు. చివరగా ఇది ఓ మొదటిసారి కాదు, ఇక్కడి నుండి కొత్తగా మొదలవుతుంది అంటూ అందరూ పాత బంధాలను మళ్లీ పదిలపరచుకున్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు పూర్వపు విద్యార్థులు పాల్గొన్నారు



