కొడిమ్యాల
శ్రీ లక్ష్మి వేంకటేశ్వర స్వామి దేవాలయం

viswatelangana.com
January 25th, 2025
కొడిమ్యాల (విశ్వతెలంగాణ) :
కొడిమ్యాల మండల కేంద్రం నిర్మాణం జరుగుతున్న శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయమునకు కొడిమ్యల వాస్తవ్యులు నాంపెల్లి అజయ్ బాబు-వీణ వీరి కుమారులు మణికంఠ, అఖిలేష్ ల కుటుంబం అజయ్ బాబు పుట్టినరోజు సందర్బంగా స్వామి వారికి వెండి మకర కుందనాలు చేయించి ఆలయ కమిటీ సభ్యులకు అందజేశారు. ఆలయానికి వస్తూ రూపేనా సహకరించిన దాతలకు అర్చకులు నాగరాజు రమేష్ తీర్థ ప్రసాదములు అందజేసి స్వామివారి మంగళ శాసనములతో ఆశీర్వదించారు. ఆలయనిర్మాణానికి, అభివృద్ధికి సహకరించిన దాతల కుటుంబానికి నిర్మాణ కమిటీ, భక్తులు, గ్రామస్తుల తరఫున ప్రత్యేక ధన్యవాదములు తెలియజేశారు.



