కొడిమ్యాల
కొడిమ్యల గ్రామానికి చెందిన 30 మంది యువకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు

viswatelangana.com
June 2nd, 2025
కొడిమ్యాల (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రానికి చెందిన దాదాపు 30 మంది యువకులు చొప్పదండి నియోజకవర్గంలో రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న అనేక సంక్షేమ పథకాలను శాసనసభ్యులు మేడిపల్లి సత్యం అందిస్తున్న ప్రజారంజక పాలనకు ఆకర్షితులై చొప్పదండి ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ క్యాంపు కార్యాలయంలో చొప్పదండి మార్కెట్ ఛైర్మన్ కొత్తూరు మహేష్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి శాసనసభ్యులు మేడిపల్లి సత్యం కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రాబోవు స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపునకు కృషి చేయడంతో పాటు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని తెలిపారు.



