రాయికల్

ఉపాధి హామీ కూలీలకు అండగా కాంగ్రెస్

viswatelangana.com

April 26th, 2024
రాయికల్ (విశ్వతెలంగాణ) :
  • ఉపాధి హామీ పథకాన్ని తీసుకువచ్చిందే కాంగ్రెస్
  • నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి కోడలు తాటిపర్తి శేరిష్మారెడ్డి

గ్రామాల్లో వ్యవసాయ కూలీలకు వంద రోజుల ఉపాధి కల్పించడానికి నాటి యూపీఏ కాంగ్రెస్ ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టి కూలీలకు ఆర్థిక భరోసా కల్పించిందని కాంగ్రెస్ పార్టీ నాయకురాలు నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి తాటిపర్తి జీవన్ రెడ్డి కోడలు తాటిపర్తి శేరిష్మారెడ్డి అన్నారు. శుక్రవారం రాయికల్ మండలంలోని వీరాపూర్ గ్రామంలో ఉపాధిహామీ పథకం కూలీలు పనిచేస్తున్న ప్రదేశానికి వెళ్లి సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. ఈ సందర్భంగా శేరిష్మా రెడ్డి మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేసేది కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని స్పష్టం చేశారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రూ.500 లకే సిలిండర్ ను ఇవ్వడం జరుగుతుందన్నారు.,ఉపాధి హామీ కూలీలకు దినసరి వేతనం 300 రూపాయలకు పెంచండం జరిగిందని, ఉపాధి హామీ సిబ్బంది ఇచ్చిన కొత్తల ప్రకారం పనిచేసి కనీస వేతనం రూ.300 పొందాలన్నారు. పెన్షన్ రాని మహిళలకు నెలకు 2500 అందించనుందని తెలిపారు. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఉపాధి హామీ కూలీలకు కనీస దినసరి వేతనం 400 రూపాయలకు పెంచడం జరుగుతుందన్నారు. బీడీ కార్మికులకు ప్రావిడెంట్ ఫండ్ ఆఫీస్ నిజామాబాద్ లో ఉండడం వల్ల బీడీ కార్మికులు చాలా దూరం వెళ్లవలసి వస్తుందని, నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి ని ఎంపీగా గెలిపిస్తే ప్రావిడెంట్ ఫండ్ ఆఫీసు, ఈఎస్ఐ హాస్పిటల్ ను జగిత్యాల కు తీసుకురావడం జరుగుతుందని హామీ ఇచ్చారు. కేంద్రంలో బిజెపి, కూడా రాష్ట్రంలో కేసీఆర్ పాలించి ప్రజలకు చేసిందేమీ లేదని, కార్పొరేట్ సంస్థలను పెంచి పోషించారని ఆమె విమర్శించారు. కేసీఆర్ తమ కుటుంబానికి ఆస్తులు సంపాదించి పెట్టారని, కానీ పేద ప్రజలకు ఒరగబెట్టింది ఏమీ లేదని మండిపడ్డారు. నిత్యం ప్రజల మధ్య ఉంటూ కష్టసుఖాల్లో పాలుపంచుకొని ప్రజా నాయకుడికి పట్టం కట్టాలని కోరారు. బడుగు బలహీన మైనార్టీ వర్గాల అభ్యున్నతికి పాటుపడుతున్న జీవన్ రెడ్డిని అత్యధిక ఓట్లతో గెలిపించి పార్లమెంటుకు పంపాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం కూలీలకు మజ్జిగ ప్యాకెట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో తాటిపర్తి హరిత రెడ్డి, డాక్టర్ గురువారెడ్డి,డాక్టర్ మల్లారెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు రవీందర్రావు, గుర్రం మహేందర్ గౌడ్, మాజీ జడ్పీటిసి గోపి మాధవి, గోపి రాజరెడ్డి, దిండిగాల రామస్వామి గౌడ్, కొయ్యడి మహిపాల్ రెడ్డి, ప్రసాద్, దుంపల స్వామిరెడ్డి, సోమ వెంకటేష్, బొలిశెట్టి గంగారాం, మల్లిక్ అహ్మద్, దుంపల నర్సారెడ్డి, ముక్కెర నరేష్, మాద నారాయణ, నీలి ఆనందం, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ఉపాధి హామీ కూలీలు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Back to top button