లోతట్టు ప్రాంతాలను సందర్శించిన జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్

viswatelangana.com
జగిత్యాల జిల్లా లోని కోరుట్ల పట్టణంలోని 10,11వ వార్డులు, మేడిపల్లి, భీమారం మండలం, కొండాపూర్, కమ్మరి పేట్, కథలాపూర్ మండలం బొమ్మెన, తాండ్రయాల గ్రామం అలాగే చెరువులు, వాగులు, పరివాహక లోతట్టు ప్రాంతాలను జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్ సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ….రాష్ట్ర వ్యాప్తంగా రెండు రోజుల వరకు భారీ వర్ష సూచన ఉన్న దృశ్య వాగులు పొంగిపొర్లి చెరువులు, కుంటలు నిండుకుండలాగా ఉన్నాయి కావున ప్రమాదకరంగా ఉన్న చెరువులు, కుంటలు వద్దకు పిల్లలు, యువత ఎవరూ చెరువుల వైపు వెళ్ళొద్దని అన్నారు. చెరువుల వద్ద అలాగే వాగుల వద్ద ప్రమాద హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయాల్సిందిగా సూచించారు. వర్షనికి ప్రజలు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి మట్టి ఇండ్లు కూలిపోయే అవకాశం ఉంటుందని, అందులో నివసించే వారు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజలు అప్రమత్తంగా ఉంటూ తక్షణ సహాయం కోసం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ డయల్ నెంబర్ 1804257620 సమాచారం ఇవ్వాలని కోరారు. పోలీసు అధికారులు అలాగే సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, వర్షాల దృశ్య కరెంటు స్తంభాల దగ్గర కు ఎవరు వెళ్లకూడదని, జిల్లా అధికారులు, మండల వివిధ శాఖ అధికారులు, గ్రామ పంచాయతీ కార్యదర్శులు మరింత అప్రమత్తంగా ఉండి ఏవిధమైన ప్రాణ, ఆస్తి నష్టం కాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కోరుట్ల ఆర్డిఓ ఆనంద్ కుమార్, డిఆర్డిఏ డిపిఓ రఘువరన్, మున్సిపల్ కమిషనర్, ఎమ్మార్వో, ఎంపీడీఓ, పోలీస్ శాఖ, వివిధ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు..



