ఏబీవీపీ కోరుట్ల నగర కార్యదర్శి మాడవేని సునీల్*

viswatelangana.com
ప్రైవేట్ పాఠశాలలు ప్రభుత్వ నిబంధనలకు విరుద్దంగా స్కూల్లల్లో పాఠ్య పుస్తకాలు అమ్ముతూ విద్యార్థులని ఇబ్బంది పెడుతున్నారని ఏబీవీపీ కోరుట్ల నగర కార్యదర్శి మాడవేని సునీల్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా సునీల్ మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కుతూ విద్యార్థుల వద్ద నుండి అధిక ఫీజులు వసూలు చేస్తూ ఇబ్బందులకి గురి చేస్తున్నారని, ఇలాంటి పాఠశాలల పైన చర్యలు తీసుకోవాలని స్థానిక విద్యాధికారులకి ఎన్ని సార్లు చెప్పిన నిమ్మకు నిరెత్తినట్లు వ్యవహారిస్తున్నారని ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలకు కొమ్ము కాస్తున్నారని అన్నారు. స్టానిక ఎస్ ఎఫ్ ఎస్ స్కూల్, శ్రీ చైతన్య, గౌతమ్ మోడల్ స్కూల్ లో తనిఖి చేయడం జరిగింది. యాజమాన్యం పుస్తకాలు అమ్ముతున్నరని తెలుసుకుని పాఠశాలల్లో తనిఖి నిర్వహించారు. అనంతరo ఎస్ ఎఫ్ ఎస్ స్కూల్ వద్ద ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా విద్యాధికారులకు సమాచారమందించారు. ప్రైవేట్ పాఠశాలలంటే జిల్లా విద్యాధికారికి అంత ప్రేమ అని ఇప్పటికైనా అధికారులు కళ్ళు తెరిచి ఇలాంటి పాఠశాలల పైన చర్యలు తీసుకొని, యాజమాన్యం పైన కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేసారు. లేని యెడల రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమం చేసి విద్యాధికారులని అధికారం నుండి తొలగించేలా చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మహదేవ్, సూరజ్, రంజిత్, నితీష్ కుమార్, హర్షవర్ధన్, లవన్ తదితరులు పాల్గొన్నారు.



