కోరుట్ల

జగిత్యాల జిల్లాలో హైడ్రా తరహా చట్టం తేవాలని జిల్లా కలెక్టర్ ను, ఎమ్మెల్సీ టి జీవన్ రెడ్డిని కోరిన డాక్టర్ పేట భాస్కర్

viswatelangana.com

September 28th, 2024
కోరుట్ల (విశ్వతెలంగాణ) :

రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సాహసోపేతమైన నిర్ణయంతో తీసుకవచ్చిన హైడ్రా తరహా చట్జం జగిత్యాల జిల్లాలో అమలు చేయాలని అనేక చెరువులు కుంటలు అన్యాక్రాంతం అవుతు కబ్జాదారుల కబంధ హస్తల్లో బందీగా మారాయని వాటిని కాపాడలని కోరుతూ జగిత్యాల జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్, ఎమ్మెల్సీ టి జీవన్ రెడ్డి లను కోరినట్లు తెలంగాణ ప్రజాసంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ పేట భాస్కర్ తెలిపారు. శనివారం టిపిఎస్ జేఏసీ, కోరుట్ల డెవలప్మెంట్ ఫోరమ్ ఆద్వర్యంలో జగిత్యాల జిల్లా కలెక్టరేట్ లో కలెక్టర్ బి సత్యప్రసాద్ ను, క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్సీ టి జీవన్ రెడ్డి లను కలిసి పలు సమస్యలు పరిష్కారం చేయాలని కోరారు. కోరుట్ల లోని మద్దెలచెరువు, తాళ్లచెరువు, కంచెరకుంట మరియు గొలుసుకట్టు కాలువలు, శిఖం భూములు బఫార్ జోన్ల స్థలాలు వాగు పరివాహక ప్రాంతాలు అన్యాక్రాంతం అవుతున్నాయని వాటిని రక్షించాలని హద్దులు నిర్ణయించి కాపాడాలని కోరగ సానుకూలంగా స్పందించారని పేట భాస్కర్ పేర్కొన్నారు. ఈకార్యక్రమంలో కోరుట్ల డెవలప్మెంట్ ఫోరమ్ అధ్యక్షులు చెన్న విశ్వనాథం, నాయకులు బట్టు సుదర్శన్, షాహిద్ మహ్మద్ షేక్, శనిగారపు రాజేష్, ఎఐటియుసి జిల్లా కార్యదర్శి ఎండి ముఖ్రామ్, ఎఎస్ఎఫ్ జిల్లా కన్వీనర్ ఆక్రమ్ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Back to top button