రాయికల్

రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు

viswatelangana.com

June 19th, 2024
రాయికల్ (విశ్వతెలంగాణ) :

జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణంలోని గాంధీ చౌక్ వద్ద రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించి కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకున్నారు అనంతరం రాయికల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొండపల్లి రవీందర్ రావు మాట్లాడుతూ భారతదేశానికి మార్గదర్శనం చేయగలిన యువ తేజం రాహుల్ గాంధీ అని ఆయన దెబ్బకు బిజెపికి ఇతర పార్టీలతో జట్టు కట్ట వలసి దుస్థితి వచ్చిందని అన్నారు గోపి రాజారెడ్డి మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల కోసం నిత్యం శ్రమించే ఏకైక జన నాయకులు రాహుల్ గాంధీ అని ఆయన సేవలను కొనియాడారు కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు మ్యకల రమేష్ మాట్లాడుతూ ప్రతిపక్షాలకు ముచ్చెంటలు పట్టిస్తూ వారు సంస్థానం అని భ్రమించే యూపీలో సైతం బిజెపికి ఎదురిత తప్పలేదని దేశంలో సుస్థిరమైన ప్రజా పాలన అందించగల ఏకైక వ్యక్తి రాహుల్ గాంధీ అని మత చాందస వాదులు మతాల పేరు చెప్పి ఎంత గెలిచే ప్రయత్నం చేసిన బడుగు బలహీనవర్గాల సంక్షేమం పట్ల ఆలోచన గలిగిన రాహుల్ గాంధీ దేశంలోనే అత్యున్నతమైన నాయకుడిగా పేరుపొందిరని అన్నారు ఈ కార్యక్రమంలో కొయ్యాడి మహిపాల్ ఎద్దండి దివాకర్ పొన్నం శ్రీకాంత్ గౌడ్ ఎను గంటి రవి మండ రమేష్ బత్తిని చిన్న భూమయ్య అత్తినేని గంగారెడ్డి సంతోష్ జక్కుల చంద్ర శేఖర్ నరసింహ రెడ్డి రాకేష్ నాయక్ తలారి రాజేష్ మున్ను ఎండి షాకిర్ జక్కుల సాగర్ రాజేష్ నాగరాజ్ రాజీవ్ తదితరులు పాల్గొన్నారు

Related Articles

Back to top button