రాయికల్

బీసీ రాజ్యాధికార సమితి జిల్లా కన్వీనర్ గా చిన్నలింబాద్రి గౌడ్

viswatelangana.com

April 17th, 2025
రాయికల్ (విశ్వతెలంగాణ) :

రాజ్యాధికార సమితి జిల్లా కన్వీనర్ గా రాయికల్ మండలంలోని ఇటిక్యాల గ్రామానికి చెందిన ఆధ్యాత్మిక,సామాజిక సేవకులు అనుపురం చిన్న లింబాద్రి గౌడ్ ను బీసీ రాజ్యాధికార సమితి వ్యవస్థాపక అధ్యక్షులు దాసు సురేష్ బుధవారం నియమించి నియామక పత్రం అందజేశారు. ఈ సందర్భంగా చిన్నలింబాద్రిగౌడ్ మాట్లాడుతూ….. నాపై నమ్మకం ఉంచి నాకు జగిత్యాల జిల్లా కన్వీనర్ గా బాధ్యతలు అప్పగించిన బీసీ రాజ్యాధికార సమితి వ్యవస్థాపక అధ్యక్షులు దాసు సురేష్ కు అభినందనలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో బీసీ సామాజిక విప్లవం మొదలైందని, రాబోవు స్థానిక సంస్థల ఎన్నికలలో పెద్ద ఎత్తున బీసీ నాయకుల గెలుపే దిశగా భవిష్యత్ కార్యాచరణను కొనసాగిస్తానని తెలిపారు. రాజ్యాధికార సాధననే బీసీలకు అంతిమ లక్ష్యం కావాలని ఆయన పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో కమిటీ మెంబర్స్ పెండం గంగాధర్, భోగ గంగాధర్, మైనం మహేష్, తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Back to top button