రాయికల్ లయన్స్ క్లబ్ కు ఉత్తమ బ్యానర్ ప్రజెంటేషన్ అవార్డు

viswatelangana.com
మంచిర్యాల జిల్లా జన్నారంలో జరిగిన లయన్స్ క్లబ్ రీజన్ మీట్ కార్యక్రమంలో బ్యానర్ ప్రజెంటేషన్ భాగంలో భాగంగా కుంభమేళ విశిష్టతను ప్రదర్శించిన రాయికల్ లయన్స్ క్లబ్ కు ఉత్తమ బ్యానర్ ప్రజెంటేషన్ అవార్డు ను రీజన్ చైర్ పర్సన్ ఏనుగు శ్రీకాంత్ రెడ్డి చేతుల మీదుగా లయన్స్ క్లబ్ అధ్యక్షులు మచ్చ శేఖర్ అందుకున్నారు. ఉత్తమ కార్యదర్శి, కోశాధికారిగా కడకుంట్ల నరేష్, కట్ల నర్సయ్య,ఉత్తమ లయన్ దంపతులుగా మ్యాకల అనురాధ రమేష్ అవార్డులను అందుకున్నారు. 2024 -25 సంవత్సర లయన్స్ క్లబ్ సేవా కార్యక్రమాలకుా గుర్తింపుగా అవార్డులు పొందారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ లయన్ మోర హన్మాండ్లు,లయన్స్ క్లబ్ సభ్యులు దాసరి గంగాధర్, కొమ్ముల ఆది రెడ్డి, వాసం ప్రసాద్, బొమ్మకంటి నవీన్, గంట్యాల ప్రవీణ్, కొత్తపెల్లి రంజిత్, వాసం స్వామి, ఆడేపు రాంప్రసాద్, సుమన్, పారిపెల్లి శివ ప్రసాద్, సాంబారు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.



