కోరుట్ల
కోరుట్లలో పలువురిని పరామర్శించిన జువ్వాడి కృష్ణారావు

viswatelangana.com
January 11th, 2025
కోరుట్ల (విశ్వతెలంగాణ) :
బాల్కొండ మాజీ ఎమ్మెల్యే ఈరవత్రి అనిల్ వారి మామ, కోరుట్ల పట్టణానికి చెందిన విశ్రాంత ప్రభుత్వ ఉపాధ్యాయులు వాసం బూమానందం, మాజీ వ్యవసాయమార్కెట్ కమిటీ చైర్మన్ గుడ్లమనోహర్ వారి తల్లి గంగు బాయి, సాయిబాబా దేవస్థానం మాజీ చైర్మన్ అల్లాడి రామేశం లు ఇటీవల మరణించగా శనివారం రోజున రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జువ్వాడి కృష్ణారావు బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. జువ్వాడి కృష్ణారావుతో పాటు మున్సిపల్ వార్డ్ కౌన్సిలర్ ఎంబేరి నాగభూషణం తదితరులు పాల్గొన్నారు.



