ఘనంగా బొంబాయి పోచమ్మ విగ్రహ ప్రతిష్ట

viswatelangana.com
జగిత్యాల జిల్లా రాయికల్ మండలం కిష్టంపేట గ్రామంలో బొంబాయి పోచమ్మ ఆలయంలో గురువారం పోచమ్మ అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ ఘనంగా నిర్వహించారు. సంప్రదాయ వాయిద్యాలతో గ్రామంలోని ఆంజనేయ స్వామి ఆలయం నుండి అమ్మవారిని గ్రామంలోని నూతనంగా నిర్మించిన పోచమ్మ ఆలయం వరకు గ్రామస్తులు ఊరేగింపు నిర్వహించారు. గ్రామం లోని ప్రతి ఇంటి నుండి మహిళలు మంగళహారతులుతో, బోనాలు ఎత్తుకొని ఆలయానికి చేరుకుని అమ్మవారికి ఇంటి బోనాన్ని, నైవేద్యాలు సమర్పించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే సంజయ్ కుమార్, ఎమ్మెల్సి జీవన్ రెడ్ది, మాజి జడ్ పి చైర్మన్ దావా వసంత సురేష్, బీజేపీ నాయకురాలు భోగ శ్రావణి, గ్రామ మాజీ సర్పంచులు, మాజి ఎంపిటిసిలు, మాజీ ఉపసర్పంచ్, మాజీ వార్డ్ మెంబర్లు, గ్రామ నాయకులు అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం పోచమ్మ సన్నిధిలో కలశపూజలు నిర్వహించారు. అనంతరం మాజీ సర్పంచ్ ఆధ్వర్యంలో అన్న ప్రసాద వితరణ చేశారు.



