కోరుట్ల

జీతాల నిలిపివేతను తక్షణమే రద్దు చేయాలి మైనారిటీలకు న్యాయం కోసం సమాజ్‌వాది పార్టీ

మొహమ్మద్ ముజాహిద్, తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి, సమాజ్‌వాది పార్టీ

viswatelangana.com

June 12th, 2025
కోరుట్ల (విశ్వతెలంగాణ) :

తెలంగాణ మైనారిటీ సంక్షేమ శాఖలో పని చేస్తున్న వేలాది మంది ఉద్యోగులు గత కొన్ని నెలలుగా వేతనాల కోసం నిరీక్షిస్తూ తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 2025 ఏప్రిల్ నెల జీతాలు ఇప్పటికీ విడుదల కాలేదు. ప్రభుత్వం నిధులు కేటాయించినప్పటికీ, ఆర్థిక శాఖ ఇంకా ఎం. ఎఫ్. సి. కార్పొరేషన్. పిడి. ఖాతాలోకి విడుదల చేయకపోవడం అన్యాయం అని సమాజ్‌వాది పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర కార్యదర్శి మొహమ్మద్ ముజాహిద్ మాట్లాడుతూ…ఇది కేవలం వేతనాల సమస్య మాత్రమే కాదు ఇది మైనారిటీలపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి ప్రతిబింబం, పేద కుటుంబాల జీవితాలతో ప్రభుత్వం, అటు నేతలు, అటు అధికారులు ఆటలాడతారా? ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి అయినా ఇప్పటికీ స్పందించకపోవడం బాధాకరం, నిర్లక్ష్యపు పరాకాష్ట అని ఆవేదన వ్యక్తం చేశారు. సమాజ్‌వాది పార్టీ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆలోచనల వెలుగులో దేశంలో సామాజిక న్యాయాన్ని సమర్థించేందుకు. ముస్లింలు, దళితులు, అలాగే ఇతర అణగారిన వర్గాల హక్కుల కోసం నిరంతరం పోరాడుతోంది. మైనారిటీ ఉద్యోగులను అణగదొక్కే విధానాన్ని మేము ఏ మాత్రం సహించము. ప్రభుత్వం తక్షణమే పిడి ఖాతాలో నిధులు విడుదల చేసి జీతాలు చెల్లించకపోతే సమాజ్‌వాది పార్టీ ప్రజా ఉద్యమాన్ని ప్రారంభించడానికి సిద్ధంగా ఉంది అని ముజాహిద్ హెచ్చరించారు.

Related Articles

Back to top button