శ్రీ అరుణోదయ డిగ్రీ కళాశాలలో క్యాంపస్ డ్రైవ్

viswatelangana.com
జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణానికి చెందిన శ్రీ అరుణోదయ డిగ్రీ కళాశాలప్రాంగణంలో 28 ఏప్రిల్ ఆదివారం ఉదయం 10:30 నిమిషాలకు, ఫ్లిప్కార్ట్, డెలివరీ, టైమ్స్ ప్రో, యాక్సిస్ బ్యాంక్, ఎస్ బ్యాంక్, యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, ఐసిఐసిఐ సెక్యూరిటీస్ కంపెనీలలో ఉద్యోగాల కొరకు శ్రీ అరుణోదయ డిగ్రీ కళాశాలలో క్యాంపస్ డ్రైవ్ నిర్వహించడం జరుగుతుంది. నిరుద్యోగ యువతీ యువకులు ఈ సదవకాశాన్ని కోరుట్ల పరిసర ప్రాంతాల్లోని ఉద్యోగ యువతీ యువకులందరూ సద్వినియోగం చేసుకోవాలని కళాశాల కరస్పాండెంట్ పోతని ప్రవీణ్ కుమార్, ప్రిన్సిపాల్ పోతని నవీన్ కుమార్ అన్నారు. ఎలాంటి ఫీజులు కట్టడం అవసరం లేదని, క్యాంపస్ డ్రైవ్ వచ్చే వారి విద్యార్హతలు గ్రాడ్యుయేషన్, 28 సంవత్సరాలు వయసు మించకూడదు, ఎస్ఎస్ఎస్సి, ఇంటర్, డిగ్రీ, కి సంబంధించిన ఒరిజినల్ సర్టిఫికెట్లు మరియు ఆధార్ కార్డు మీ యొక్క రెస్యూమ్ తీసుకొని ఇంటర్వ్యూకి రావాలని అన్నారు.



