కోరుట్ల
సాయి జీనియస్ హై స్కూల్లో టీచర్స్ డే

viswatelangana.com
September 5th, 2024
కోరుట్ల (విశ్వతెలంగాణ) :
కోరుట్ల పట్టణ సాయి జీనియస్ హై స్కూల్ సర్వేపల్లి రాధాకృష్ణ జయంతిని పురస్కరించుకుని టీచర్స్ డే ను ఘనంగా నిర్వహించారు. ఇట్టి కార్యక్రమాన్ని చిన్నారులు ఉత్సాహంగా టీచర్స్ బాధ్యతలు నిర్వహించారు. దీనిలో భాగంగా 98 మంది విద్యార్థులు ఉపాధ్యాయులుగా పాల్గొన్నారు. ఇట్టి కార్యక్రమాన్ని పురస్కరించుకొని సాయి జీనియస్ హై స్కూల్ కరస్పాండెంట్ మాట్లాడుతూ… టీచరుగా ప్రారంభించిన సర్వపల్లి రాధాకృష్ణ దేశంలో అత్యున్నతమైన పదవి రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి పదవులను నిర్వహించారని పిల్లలకు తెలిపారు. ఈకార్యక్రమంలో విద్యార్థులు టీచర్ గా నిర్వహించిన తమ అనుభవాన్ని పంచుకున్నారు. తదుపరి విద్యార్థులు ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు. ఇట్టి కార్యక్రమంలో కరస్పాండెంట్ చౌకి రమేష్, ప్రిన్సిపల్ చౌకి సుధ మరియు ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.



