రాయికల్

24 సంవత్సరాల సర్వీసు పూర్తి అయి గెజిటెడ్ హోదా లభించని ఉద్యోగ ఉపాధ్యాయులకు గెజిటెడ్ హోదా కల్పించాలి

viswatelangana.com

December 6th, 2024
రాయికల్ (విశ్వతెలంగాణ) :

24 సంవత్సరాల సర్వీసు పూర్తి అయి గెజిటెడ్ హోదా లభించని ఉద్యోగ, ఉపాధ్యాయులందరికి గెజిటెడ్ హోదా కల్పించాలని, 24 సంవత్సరాల సర్వీసు పూర్తి అయిన ఉద్యోగ ఉపాధ్యాయుల వేతనం గెజిటెడ్ హోదా వారి స్కేల్ తో సమానంగా ఉంటుంది కాని గెజిటెడ్ హోదా రాకపోవడంతో ఆత్మ గౌరవ సమస్యగా భావిస్తున్నారనీ, గెజిటెడ్ హోదాలో రిటైర్మెంట్ అయితే బాగుంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారని, 24 సంవత్సరాల సర్వీసు పూర్తయినప్నటికినీ గెజిటెడ్ హోదా రాకుండానే చాలా మంది ఉద్యోగ ఉపాధ్యాయులు రిటైర్మెంట్ పొందుతూ వాపోతున్నారని, ఈ నేపథ్యంలో 24 సంవత్సరాల సర్వీసు పూర్తి అయిన ఉద్యోగ ఉపాధ్యాయులకు గెజిటెడ్ హోదా కల్పించడంలో ప్రభుత్వానికి ఆర్థిక భారం వుండదని, ఈ క్రమంలో 24 సంవత్సరాల సర్వీసు పూర్తి అయిన ఉద్యోగ ఉపాధ్యాయులందరికి గెజిటెడ్ హోదా కల్పించి ఆత్మ గౌరవ సమస్య ను పరిష్కరించి న్యాయం చేయాలని కోరుతూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ కు తెలంగాణ యాదవ మహాసభ ఉద్యోగుల సంఘం రాష్ట్ర శాఖ పక్షాన సవినయంగా కోరుతూ రిజిష్టర్ పోస్ట్, మేయిల్ ద్వారా వినతిపత్రం పంపినట్లు రాష్ట్ర శాఖ అధ్యక్షులు వేల్పుల స్వామి యాదవ్ తెలిపారు.

Related Articles

Back to top button