317 జి ఓను రద్దు చేయాలి తపస్ రాష్ర్ట కార్యదర్శి – వీరమల్ల వెంకట రమణ రావు
తపస్ మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా ఆదిరెడ్డి, రాజగంగయ్య

viswatelangana.com
జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం కేంద్రంలో శనివారం తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర కార్యదర్శి వీరమల్ల వెంకట రమణ రావు అద్వర్యంలో తపస్ కొడిమ్యాల మండల శాఖ ఎన్నికలు జరిగాయి. కొడి మ్యాల మండల అధ్యక్షులు గా ఏనుగు ఆదిరెడ్డి, (ఉన్నత పాఠశాల తిరుమలాపూర్) ప్రధాన కార్యదర్శిగా రాజ గంగయ్య( ఉన్నత పాఠశాల నాచుపల్లి )లను ఏక గ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా తపస్ రాష్ట్ర కార్యదర్శి వీరమల్ల వెంకట రమణ రావు మాట్లాడుతూ స్కూలు డ్రెస్సుల్లో నాణ్యత ఉండే విదంగా చూడాలని,ప్రభుత్వం వెంటనే 5 డీ ఏ లను,పీ ఆర్ సి నీ ప్రకటించాలని, 317 జి ఓను రద్దు చేయాలనీ, పెండింగ్ లో ఉన్న అన్ని బిల్లులను క్లియర్ చేయాలని, ఎస్ జి టి లకు ఎమ్మెల్సీ లో ఓటు హక్కు కల్పించాలని, బీఈడీ చేసిన సెకండరీ గ్రేడ్ టీచర్స్ తో 10000 లు పోస్టులు మంజురు చేసి పి ఎస్ హెచ్ ఎమ్ పోస్టులు భర్తీ చేయాలని, కేజీవివి, మోడల్ స్కూల్ ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర కార్యదర్శి వీర మల్ల వెంకట రమణ రావు, జిల్లా కార్యదర్శి గోనే శ్రీని వాస్, జిల్లా సహ కార్యదర్శి కల్యాణ్, తపస్ మండల బాధ్యులు గుడి భూపతి రెడ్డి,బొమ్మ సురేష్, ప్రవీణ్రెడ్డి, రాజన్న, వెంకటేశం, మన్మధ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.



