రాయికల్
ప్రోటోకాల్ వివాదము బి ఆర్ ఎస్ నాయకులు కార్యకర్తల ఆందోళన

viswatelangana.com
March 7th, 2024
రాయికల్ (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణంలో స్థానిక తాసిల్దార్ కార్యాలయంలో కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ చేపట్టారు. ముఖ్యఅతిథిగా ముఖ్యమంత్రి మరియు ఉప ముఖ్యమంత్రి ఫోటోలతో ఫ్లెక్సీ ఏర్పాటు చేయగా చెక్కుల పంపిణీకి వచ్చిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ఫోటో ఫ్లెక్సీలో లేకపోవడంతో నాయకులు కార్యకర్తలు ఆందోళనకు దిగారు. మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ గండ్ర రమాదేవి ఎమ్మెల్యేను విస్మరించడంపై అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.



