జగిత్యాల
గురుకుల పాఠశాలలో ఆకస్మిక తనికి చేసిన కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్
viswatelangana.com
January 19th, 2024
జగిత్యాల (విశ్వతెలంగాణ) :
మెట్ పల్లి పట్టణంలోనిమహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలను స్థానిక శాసనసభ్యులు డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ ఆకస్మిక తనిఖీ చేశారు. పాఠశాలలలోని వంట గది, బోజనశాల, స్టోర్ రూమ్ లతో పాటు తరగతి గదులను పరిశీలించి,హాస్టల్లో కల్పిస్తున్న సౌకర్యాలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. కార్యాలయంలో హాజరు మరియు అడ్మిషన్ల రిజిస్టర్లను పరిశీలించారు. ఏమైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తేవాలని ప్రిన్సిపాల్ కి సూచించారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టాలని అధికారులను ఆదేశించారు.



