రాయికల్

కుమ్మర కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి

viswatelangana.com

March 15th, 2024
రాయికల్ (విశ్వతెలంగాణ) :

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కుమ్మర కార్పొరేషన్ ను ఏర్పాటు చేయాలని జగిత్యాల జిల్లా కుమ్మర యూత్ ప్రధాన కార్యదర్శి, బీసీ సంక్షేమ సంఘం నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ఆర్గనైజింగ్ సెక్రటరీ గంగాధరి సురేష్ ప్రజాపతి ప్రభుత్వాన్ని కోరారు. రాయికల్ మండల కేంద్రములో సురేష్ ప్రజాపతి మాట్లాడుతూ ఉమ్మడి పది జిల్లాల్లో ప్రతి జిల్లా కేంద్రంలో స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, వర్క్ షాప్ నిమిత్తం స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ని కుమ్మర కార్పొరేషన్ లో విలీనం చేయాలని, రాజాస్థాన్, కర్ణాటక మోడల్ లో తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయాలన్నారు. కుమ్మర సామాజిక వర్గానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడి జిల్లా ల్లో ప్రతి జిల్లాలో ప్రభుత్వ స్థలం కేటాయించాలి. వెయ్యి కోట్లతో కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని, తెలంగాణ రాష్ట్రంలో కుమ్మర సామాజిక వర్గం మూడు శాతం ఉన్నారని, ఉమ్మడి పది జిల్లాల్లో ప్రతి జిల్లా లో కుమ్మర సమాజం వర్గం తయారు చేసే పింగాణి మట్టి పాత్రలకి మార్కెటింగ్ సౌకర్యం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయాలి కృషి చేయాలని , ఈ సామాజిక వర్గానికి సబ్సిడీ రూపంలో ప్రభుత్వం రాయితీలు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేశారు.

Related Articles

Back to top button