రాయికల్
కాంగ్రెస్ పార్టీ లో చేరికలు

viswatelangana.com
March 17th, 2024
రాయికల్ (విశ్వతెలంగాణ) :
రాయికల్ మండలం వడ్డేలింగపూర్ గ్రామానికి చెందిన ఈదుల లక్ష్మణ్ కుమార్ గత అనేక సంవత్సరాల నుండి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో ఉన్నారు.గతంలో తెరాస మండల మండల ప్రధాన కార్యదర్శి గా కూడ వీధుల నిర్వహించారు. పార్టీలో అనుకున్నంత ప్రాధాన్యత దక్కకపోవడంతో నూతనంగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వం పాలన తీరు నచ్చి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇట్టి సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రజలను ఆదుకుంటున్న తీరు సంక్షేమ పథకాలు, ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు, మహిళల కోసం మహాలక్ష్మి పథకం ఉచిత బస్సు ఇందిరమ్మ ఇండ్లు పావలా వడ్డీ రుణాలు పథకాల అమలు తో కాంగ్రెస్ పార్టీతోనే రానున్న తెలంగాణ భవిష్యత్తు అద్భుతంగా ఉంటుందని పేదలకు న్యాయం జరుగుతుంది అని ఆయన తెలిపారు.



