రాయికల్
రామాజీపేట పాల కేంద్రం లో రైతు అవగాహన సదస్సు

viswatelangana.com
March 21st, 2024
రాయికల్ (విశ్వతెలంగాణ) :
కరీంనగర్ డెయిరీ ఆధ్వర్యంలో రాయికల్ మండలం రామాజిపేట లో పాడి రైతు అవగాహన సదస్సు కార్యక్రమాన్ని నిర్వహించారు డెయిరీ వైద్యాధికారి రంజిత్ కుమార్ జగిత్యాల మేనేజర్ రవీందర్ రావు ఈ సదస్సు లో వారు మాట్లాడుతూ పాడి రైతులు పశువుల ఆరోగ్యం పట్ల పాల దిగుబడి ఆహారం పరిశుభ్రత అంశాల మీద అవగాహన కల్పించారు పాడి రైతులు పాలు పితికే వ్యక్తి ఏ విధంగా పితకాలి వ్యక్తి పాటించే పరిసరాలు పరిశుభ్రత దూడల పట్ల పాలు, వాటికి వచ్చే వ్యాధుల పట్ల ముందస్తు జాగ్రత్తలు వాటికి అవసరమయిన అంశాల పైన అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో అధ్యక్షులు అంబల్ల రాజారెడ్డి జగిత్యాల వైద్య సూపర్ వైజర్ రాములు గ్రామ పాడి రైతులు వినియోగ దారులు సూపర్ వైజర్ రాజేష్ కార్యదర్శి సుధాకర్ నితిన్ తదితరులు పాల్గొన్నారు..



