రాయికల్

చలివేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయం

viswatelangana.com

March 24th, 2024
రాయికల్ (విశ్వతెలంగాణ) :

వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయమని మాజీ సర్పంచ్ సామల్ల లావణ్య వేణు అన్నారు. ఆదివారం రాయికల్ మండలంలోని ఇటిక్యాల గ్రామంలో ప్రధాన కూడలి ఆవరణంలో 1994-95 విద్యా సంవత్సరంలో 10వ తరగతి విద్యనుభ్యసించిన విద్యార్థుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా 1994-95 బ్యాచ్ విద్యార్థులు మాట్లాడుతూ ఎండల తీవ్రత రోజురోజుకు పెరుగుతున్న తరుణంలో గ్రామ ప్రజలకు ప్రయాణికులకు దాహార్తి తీర్చడానికి తమ వంతు సహాయంగా చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అదేవిధంగా జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల అభివృద్ధికి కూడా తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా వారిని గ్రామస్తులు అభినందించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కాటిపల్లి గంగారెడ్డి, నాయకులు సురకంటి రాజారెడ్డి, మరి పెళ్లి శ్రీనివాస్ గౌడ్, గ్రామ సేవా సమితి అధ్యక్షులు కంటే విష్ణు, నేతల సోమయ్య, నాగిరెడ్డి, నారాయణరెడ్డి, బద్దం సుజాత, శేఖర్, 94-95 బ్యాచ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Back to top button