రాయికల్
పండగ పూట విషాదం
viswatelangana.com
March 25th, 2024
రాయికల్ (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణంలో పండగ పూట విషాదం నెలకొంది నర్ర నగేష్ అనే యువకుడు మండలంలోని వీరాపూర్ గ్రామ శివారులో గల వ్యవసాయ బావిలో స్నానం కోసం భావి వద్దకు తన స్నేహితులతో వెళ్లాడు స్నానం చేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు నీటిలో మునిగి గల్లంతయ్యాడు వెంట వెళ్లిన స్నేహితులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించడంతో వెంటనే వారు పోలీసులను ఆశ్రయించారు గల్లంతైన నగేష్ కోసం ఫైర్ సిబ్బంది గజ ఈతగాళ్లు వెతకగా మృతదేహం లభ్యమయింది అప్పటివరకు హోలీ వేడుకల్లో చాలా ఉత్సాహంగా గడిపిన నగేష్ బావిలో పడి మృతి చెందడంతో స్వగ్రామంలో విషాదం నెలకొంది



