సత్య సాయి భజన మండలి ఆధ్వర్యంలో మంగళసూత్రం పంపిణీ

viswatelangana.com
శ్రీ శివభక్త మార్కండేయ మందిరములో శ్రీ సత్య సాయి భజన మండలి వారి ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా భజన కార్యక్రమము జరిగింది ఇందులో నిరుపేద యువతి గొల్లపెల్లి నవ్య వివాహ సందర్భంగా మంగళసూత్రము మట్టెలు మరియు తాంబూలం బిందె అందచేయటం జరిగింది. అలాగే ఇందులో ప్రత్యేక అతిధులుగా విచ్చేసిన జిల్లా కన్వీనర్ వెలయేశ్వర్-పావని మరియు వాసాల శేషషయన-ఉమ దంపతులు తపోవనం బుక్స్ పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీ సత్య సాయి భజన మండలి రాయికల్ కన్వీనర్ గారు శ్రీ గాజంగి అశోక్ జీ , బిరుదు రాజు సుభాష్ రాజు మండలొజు రవికుమార్ కుంబోజి రవి శ్రీరాముల లక్ష్మి నారాయణ మామిడాల భీమయ్య ఎలిగేటి దేవరాజం వెగ్యరపు రమేష్ మామిడాల లక్ష్మి నారాయణ గార్లు పాల్గొన్నారు. మరియు మహిళా ఆధ్యాత్మిక కన్వీనర్లు బిరుదు రాజు మమత ఆడెపు గీత శ్రీరాముల ప్రభావతి మామిడాల సువర్ణ మామిడాల సుజాత కుంభోజి లత మరియు సభ్యులు సుమారు 50 కి పైగా భక్తులు పాల్గొనడం జరిగింది.



