డ్రైనేజీ సమస్యపై వినతిపత్రం ఇచ్చిన విద్యార్థిని

viswatelangana.com
జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణము లోని 11 వార్డులో తమ ఇంటి ముందు ఉన్న డ్రైనేజీ లో మురికి తో నిండి దుర్గంధం వ్యాపిస్తుందని దానితో విష జ్వరలు తదితర అనారోగ్య ఇబ్బందులు తలెత్తుతున్నాయని విస్డం హైస్కూల్ లో ఆరో తరగతి చదువుతున్న మనహ ముబిన్ అను విద్యార్థిని అతి చిన్న వయసులోనే సామాజిక స్పృహతో తమ సమస్యపై స్వహస్తాలతో వినతి పత్రం రాసి పురపాలక సంఘ కార్యాలయానికి వెళ్లి కమిషనర్ జగదీశ్వర్ గౌడ్ కు వినతిపత్రం సమర్పించింది తమ కాలనీలో డ్రైనేజీ సమస్య వలన అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని తెలిపింది దాంతో పాటు పక్కనే ప్రభుత్వ పాఠశాల ఉందని నాలాంటి విద్యార్థులు కూడ ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని పేర్కొంది అతి చిన్న వయసులోనే బాధ్యతయుతంతో సమస్య పై అవగాహన తో ఫిర్యాదు చేసిన విద్యార్థినిని పురపాలక సంఘం కమిషనర్ అభినందించారు ఇట్టి సమస్య అతి త్వరలో పరిష్కరిస్తామని ఆయన తెలిపారు



