రాయికల్
రాయికల్ మండల వ్యవసాయ ఇన్పుట్ డీలర్ అవగాహన సదస్సు

viswatelangana.com
April 10th, 2024
రాయికల్ (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా రాయికల్ మండలం అల్లిపూర్ గ్రామంలో రైతు వేదికలో జిల్లా వ్యవసాయ అధికారి వాణి మాట్లాడుతూ 75% జిల్లాలో వ్యవసాయంపై ఆధారపడి రైతులు ఉన్నారని రైతుల పక్షాన ఆలోచించి నాణ్యతమైన విత్తనాలను తీసుకురావాలని విత్తన చట్టం ఎరువుల నియంత్రణ చట్టం ప్రతి ఏవో పరిధిలో ఉంటుంది డీలర్స్ సంబంధించిన సీడ్స్ పెస్టిసైడ్స్ ఫర్టిలైజర్స్ స్టాక్ రిజిస్టర్లు షాపుల్లో తప్పనిసరిగా ఉపయోగించి ఏప్రిల్ ఒకటి నుండి మార్చి 31 వరకు స్టాక్ రిజిస్టర్ మైంటైన్ చేయాలని తెలియజేశారు సంబంధించిన కంపెనీ యొక్క పిసిలు ఉంటేనే రైతులకు సరుకులు పంపిణీ చేయాలని పైన వాటిని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి ముక్తేశ్వర్ రాయికల్ మండల డీలర్లు పాల్గొన్నారు



