కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ పలు గ్రామాలలో పర్యటన

viswatelangana.com
కథలాపూర్ మండలం కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ కుమార్ మీడియా మిత్రులతో మాట్లాడుతూ. కలికోట శివారులో సూరమ్మ చెరువును రిజర్వాయర్ గా మార్చి కుడి ఎడమ కాలువల ద్వారా వేములవాడ నియోజకవర్గంలోని కథలాపూర్, మేడిపల్లి, భీమారం, రుద్రంగి మండలాల్లో 50వేల ఎకరాలకు నీరందించే పనులకు 2018 సంవత్సరంలో అప్పటి నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు 24 కోట్ల రూపాయలు కేటాయిస్తూ భూమి పూజ చేశారు. ఇప్పటికీ పనులు ప్రారంభం కాలేదు. అట్లాగే ఈ మండలంలోని సిరికొండ – తక్కలపల్లి గ్రామాల మధ్య వాగు పై బ్రిడ్జి నిర్మాణానికి 6 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ 6 ఏళ్ల క్రితం భూమి పూజ చేశారు. ఆ బ్రిడ్జి ఇప్పటికీ పూర్తి కాలేదు. ఈ మండలంలోని భూషణరావుపేట శివారులో రాళ్లవాగు ప్రాజెక్టు కుడికాలువకు గండిపడి 8 నెలలైంది. 5 వందల ఎకరాల్లో పంట ఎండిపోయింది. గండిని పూడ్చలేదు.. పంట పరిహారం లేదు.. బీఆర్ఎస్ పాలనలో రైతులు, ప్రజల బతుకులు పెనం మీద పడ్డట్లుంటే. కాంగ్రెస్ పాలనలో పెనం మీద నుండి పొయ్యి పడ్డట్లుంది అని అన్నారు



