మేడిపల్లి
గల్ఫ్ కార్మికుల సమస్యలు వివరించిన తెలంగాణగల్ఫ్ అధ్యక్షుడు

viswatelangana.com
April 16th, 2024
మేడిపల్లి (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా భీమారం మండలంలోని గ్రామానికి చెందిన తెలంగాణ గల్ఫ్ కాంగ్రెస్ అధ్యక్షుడు సింగిరెడ్డి నరేష్ రెడ్డి మంగళవారం హైదరాబాదులోని తాజ్ డెక్కన్ హోటల్లో జరిగిన గల్ఫ్ భరోసా ఆత్మీయ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి కి గల్ఫ్ కార్మికుల, సమస్యలు విన్నపించాడు. ఈ సమావేశంలో ప్రభుత్వ విప్ వేములవాడ నియోజకవర్గం ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, జగిత్యాల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జీవన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.



