బీడీ టేకు దారులకు కమిషన్ రెటు పెంచాలి

viswatelangana.com
తెలంగాణ రాష్ట్రంలో వివిధ నమూనా రకాల బీడీ పరిశ్రమలలో పనిచేసే బీడీ టేకేదారులకు కమిషన్ రేట్ పెంచి, ఇతర సమస్యలు పరిష్కరించాలని ఏఐటీయూసీ అనుబంధ తెలంగాణ బీడీ టేకేదారుల సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు సుతారి రాములు బీడీ యజమానులను డిమాండ్ చేశారు. బీడీ ఏకదారుల సమావేశంలో మాట్లాడుతూ నిత్య జీవితాల వస్తువుల ధరలు పెరిగిపోయి నందున, పెట్రోల్ డీజిల్ ధరలు అనేకసార్లు పెరిగినందున మరియు ఎగుమతి దిగుమతి ట్రాన్స్ పోర్ట్ ఖర్చులు పెరిగినందున, బీడీ టేకేదారులకు కమిషన్ రేటు వెంటనే పెంచాలన్నారు. గత రెండు సంవత్సరాల క్రితం కమీషన్ రేటు కోసం చేసుకున్న ఒప్పంద గడువు ముగిసినందున వెంటనే చర్చలకు పిలిచి అగ్రిమెంటు చేయాలన్నారు. ఒక్క వెయ్యి బీడీలకు 18 రూపాయల కమిషన్ నుండి 30 రూపాయలకు పెంచాలని, గతంలో మాదిరిగా బీడీ టేకేదారుల ద్వారా బీడీ కార్మికులకు కూలి డబ్బులను పంపిణీ చేసే విధానాన్ని అమలు చేయాలన్నారు. బ్యాంకు ద్వారా కార్మికులకు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత అగ్రిమెంట్ సమయంలో బీడీ టేకేదారుల నుండి తీసుకున్న సెక్యూరిటీ డబ్బులను బ్యాంకులో జాయింట్ ఫిక్స్డ్ డిపాజిట్ చేసి, వచ్చే బ్యాంకు వడ్డీని కమీషన్ దారులకు చెందటట్లు చేసుకున్న ఒప్పందాన్ని వెంటనే అమలు చేయాలన్నారు. అలాగే లేబర్ లైసెన్సు ఇంటి అద్దెలు మున్సిపల్ టాక్సీలు బీడీ కంపెనీ దారులే భరించాలన్నారు. న్యాయమైన తునికాకు సరఫరా చేసి నాన్ పిఎఫ్ కార్మికులకు పిఎఫ్ నెంబర్లు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. మరియు ఎలాంటి ఆంక్షలు లేకుండా బీడీ టేకదారులకు జీవన భృతి అందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ సమావేశంలో దేశాయి బీడీ, టెలిఫోన్ బీడీ, శివాజీ బీడీ, చార్ బాయ్ బీడీ, సీజే పటేల్ బీడీ, 30 నెంబర్ బీడీ, భారత్ బీడీ, జెమినీ, గౌతమ్, మయూరి, గణేష్ బీడీ, టేకేదారులు సాంబయ్య శంకర్ రవి నరసయ్య సత్తయ్య బాపూరావు బలరాం భూమన్న శేఖర్ ప్రసాద్ మల్లేశం ప్రతాపరెడ్డి రమేష్ గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.



